శ్రీవిద్య తంత్ర యోగ
(All Classes/Sessions are Free)

సరియైన దినచర్య లేకుండా కుటుంబ జీవనం ప్రధానంగా కల వ్యక్తి సాధన పై దృష్టి సారించడం అంత సులభం కాదు.నాడి శుద్ధి లేకుండా సాధకుడు ప్రాణాయామ అనుభూతిని పొందలేడు.సుషుమ్న శ్వాస లేకుండా మంత్రం యొక్క లోపలి తరంగాలని కూడా అనుభూతిని పొందలేడు .కాబట్టి తంత్రం యొక్క ప్రయోజనాలని అనుభూతి చెందడానికి నిర్దిష్ట స్థాయిని అధిగమించడం తప్పనిసరి. ఇలాంటి బోధన పద్దతుల క్లుప్త వివరణ:

ప్రారంబిక పద్ధతులు

దినచర్య ,తత్వ శుద్ధి / పంచ అమర యోగ, నాడి మరియు ప్రాణయోగ , షడ్ ఆధారాలు మరియు షోడశ ఆధారాలు,అష్ట కుంభక మరియు దశ ముద్రలు , మరియు చివరిగా ప్రణవం పంచాక్షరీ సాధన.

శ్రీవిద్య పునాది స్థాయి

గురు గణపతి మరియు ఇష్ట దేవతా సాధన ,షడ్ ఆధార సాధన పరా ప్రసాద విద్య ,బాల దేవి -అంతరిక జపం ,పూజ , హోమం,మరియు తర్పణం (త్రిపుర,బాల విద్య (త్రిఅక్షరీ ),బాల పరమేశ్వరి విద్య (షడాక్షరీ ) మరియు యోగ బాల విద్య ( నవాక్షరి )

శ్రీవిద్య మధ్యస్థ స్థాయి

వ్యోమ పంచక విద్య ,లలిత సాధన కలిగిన పంచదశి విద్య ,వామకేశ్వరి విద్య మరియు చంద్ర విద్య .చంద్ర విద్యలో మేరు ప్రస్తారం ,కైలాస ప్రస్తారం మరియు భూ ప్రస్తారం వివరించబడ్డాయి ,చంద్రకళ విద్య యొక్క అంగ విద్యతో నిత్యలు సంభందం కలిగి ఉన్నాయి.

శ్రీవిద్య ఉన్నత స్థాయి

షోడశి విద్య – ఇడా,పింగళ లో ఉన్న 16 చక్రాలకు గాను 16 నిత్యలు మరియు సుషుమ్న నాడిలో ఉన్న 28 చక్రాలకు గాను షోడశి విద్యను నేర్పబడుతుంది. చివరిగా జాగృత – జాగృత వ్యవస్థలోని కామాకలా విద్యతో పాటు దాని అంగ విద్యలను నేర్పిస్తారు.ఇది పరా విద్యలో ఒక అంగ విద్య.అలాగే జాగృత – స్వప్న అవస్థలోని పంచకూట పంచమి విద్యను మరియు దాని అంగ విద్యనూ మరియు జాగృత–సుషుప్త అవస్థలోని పంచ ఆకాశ మరియు దాని అంగ విద్యన్నీ కూడా శ్రీవిద్య ఉన్నత స్థాయి షోడశి విద్య లో నేర్పించబడుతుంది.

ప్రాథమిక ,మధ్యస్థ మరియు ఉన్నత స్థాయిలు ఒప్పందములు మాత్రమే లోలోపలి శరీర తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విద్యలని వర్గీకరించడానికి మరియు ఇది అందరూ నేర్చుకొనే పఠనా అంశం కాదు. చాలా మందికి మధ్యస్థ స్థాయిలోని మేరు ప్రస్తారం వలే శరీరము యొక్క ఆంతరంగిక పూజ ప్రాథమిక స్థాయిలోని పరా ప్రసాద విద్యలు ధ్యానములో సమాధి స్థితిని అనుభవానికి తోడ్పడుతాయి.
error: Content is protected !!