కేరళ తంత్రము

IIకేరళాఖ్య మతం చైఖ్యం కాశ్మీరం తు ద్వైతీయకం
గౌడ సమాజనం తృతీయం శ్యాన్మతం తు భావన విధౌ:
అదౌతూ కేరళం దేవి శుద్ధం సర్వేషు సమ్మతం II

శక్తి సంగమ తంత్ర
(తృతీయో భాగ: సుందరి ఖాండ:తృతీయ పాఠ:)

మన హిందూ ధర్మ తంత్ర శాస్త్రంలో మూడు సాంప్రదాయలు ప్రచారంలో ఉన్నాయి ,అవి ఏమనగా కేరళ ,కాశ్మీరీ మరియు బెంగాళీ సాంప్రదాయాలు . కేరళ సాంప్రదాయము శుద్దమైనదిగా మరియు జనసామాన్యలు కూడా ఆచరించ తగినదని పరిగణించబడినది .శక్తి సంగమ తంత్ర (హిందూ ధర్మంలో తంత్ర శాస్త్రము మూడు ముఖ్యమైన ప్రవాహములుగా ఇమిడివుందని అని ఇతర ఆగమ శాస్త్ర పాఠాలలో ఉల్లేకించబడినది).

కేరళ బ్రాహ్మణుల ఆచార విధివిధానములుగానే ఈ శ్రీ విద్య పీడం లో కూడా ఆచరించబడును .ఇక్కడ ప్రధానముగా దక్షిణా చార క్రమమునే ఆచరించ బడుతుంది .వామాచారా మరియు మిశ్రచారాములు కూడా కేరళలో ప్రసిద్ధి చెంది ఉన్నవి .కేరళ ఆచారంతో పాటు కాశ్మిరీ ,గౌడ మిశ్రిత ద్రావిడ కౌళ సాంప్రదాయ ,వేద సాంప్రదాయ మరియు ఇతర మూల సాంప్రదాయాలతో కూడిన శ్రీ విద్యాతంత్రములు కేరళ లో ఇప్పుడిప్పుడు ప్రసిద్ధి చెందుతున్నవి .

భారతీయ తాంత్రిక సమాజంలో కేరళ సంప్రదాయము అత్యంత మహాత్తరమైన స్థానాన్ని పొంది ఉన్నది . ఇది స్వల్పనంగా లిఖితం చేయబడింది మరియు మూడు సాంప్రదాయాలలోకెల్లా అత్యంత రహస్యమైనది కూడా .కేరళ సంప్రదాయానికి మరియు మిగిలి మూడు సంప్రదాయాలకు వ్యత్యాసాలను వివరణాలన్నీ శక్తి సంగమ తంత్ర సుందరి ఖండంలో వివరించబడింది.

error: Content is protected !!