శ్రీవిద్య తంత్ర పూజ
(All Classes/Sessions are Free)

ఒక క్రమబద్ధమైన శైలిని శ్రీవిద్య తంత్ర పీడంలో అనుసరిస్తారు.సాధకుల యొక్క సాధనలో ఆధ్యాత్మిక అభివృద్ధిని ఏర్పరచు కోవడానికి మరియు పెంపొందించుకోవడానికి బోధన విధివిధానాలు క్లుప్తంగా వివరణ:

పూజ మరియు హోమాలు యొక్క లఘు లేక క్లుప్త వివరణ :

గణపతి హోమం ,శివ పూజ ,దుర్గ పూజ మరియు కాళీ పూజలను మొదటిగా నేర్పబడుతుంది కాబట్టి అభ్యాసకులకి మంచి పునాది అవుతుంది పూజలు మరియు హోమాలు ఇళ్ళ వద్ద వేరే వారి కొరకు లేక గుళ్ళల్లో ఎవ్వరి ప్రమేయం అవసరం లేకుండా నిర్వర్తించడానికి.

శ్రీవిద్య దేవతల యొక్క సాధన మరియు లఘు పూజ :

తరువాత బాల ,శ్రీవిద్య రజిని ,మాతంగి ,వారాహి,అశ్వారూఢా ,సంపత్కరీ ,ప్రత్యంగిరా ,లలిత మరియు షోడశి సాధనలు మరియు పూజలు నేర్పబడుతాయి .సాధకులకు నిర్దేశిత అభివృద్ధి పొందడానికి ,శ్రీవిద్యలోని ప్రతి దేవత సాధన యొక్క ప్రయోజనాల అనుభూతిని పొందడానికి ఇలా వరుసగా నేర్పించబడుతుంది .

సవివరమైన ఆవరణ పూజ (సపరివార పూజ ) :

– శ్రీవిద్య దేవతల సాధన తరువాత బాల యొక్క నవ యోగిని పద్మజ పూజ ,లలిత దేవి యొక్క నవావరణ పూజ ,మరియు షోడశి యొక్క అత్యంత సంపూర్ణమైన ఆవరణ పూజలతో సహా సవివరమైన ఆవరణ పూజలు నేర్పింపబడుతాయి.

మహా హోమ వివరణ :

మహాగణపతి హోమ వివరణ , అఘోర శివ హోమం ,శ్రీవిద్య లలిత హోమం మహా ప్రత్యంగిరా హోమం మరియు ఇతరమైన హోమాలు శ్రీవిద్య సాధనలో నిర్ణీత అభివృద్ధి ప్రకారంగా సాధకులకు ఆసక్తి ఆధారంగా నేర్పబడును.

అంతర్గత (అంతరిక ) పూజ మరియు హోమ:

వ్యక్తిలో దైవత్వాన్ని అనుభూతి చెందడం కూడా నేర్పబడుతుంది ,సాధకులు బాహ్య పూజ పద్ధతులు సులువుగా ఆచరించిన తరువాత మరియు వ్యక్తి తనలో దేవుణ్ణి ఆరాధించే పరిపక్వత చూపించినప్పుడు. ఇది నిర్దారిస్తుంది బాహ్య పూజ అభ్యాసాల ప్రయోజనాలను సాధకుని లోపలి దైవత్వాన్ని హద్దులు లేకుండా చేస్తుంది అన్వేషించి పరిశోదించడాన్ని.ఇంకా వివరణాత్మకంగా అంతర్గత పూజలో శ్రీ చక్ర పూజ ,ఆవరణ పూజ మాదిరి లోపలి అంతర్గత చక్రాల యొక్క పూజలతో సహా బోధింపబడుతుంది.

ఈ సమాచారం బాహ్య మరియు అంతరిక పూజ , హోమాలకు పరిమితమైనదికాదు.మంత్ర సాధన ,ప్రయోగ ,పురశ్చరణ మరియు వివిధ దశలలో ఎలా శ్రీవిద్య దీక్షని ఇచ్చే వివరాలు కూడా దీక్ష కొరకు వివిధ కళశాలని తయారు చేయడంతో సహా బోధింపబడుతుంది.
error: Content is protected !!