జ్యోతిష్యం

జ్యోతిష్య శాస్త్రము వర్కుషాప్ లు ,బృంద చర్చలు వారాంతపు తరగతులు మరియు వ్యక్తిగత తరగతుల రూపంలో అందిచబడుతున్న అంశాలు .

కేరళ ప్రశ్న (హోరరీ) జ్యోతిష్యము

కేరళ కవాడి ప్రశ్న వాడుకలో హోరరీ జ్యోతిష్యం ను మూలం నుండి సమగ్ర మైన విశ్లేషణాత్మకంగా దొంగతనం ,వివాహం,ఆరోగ్యం,వృత్తి,ప్రయాణం,వ్యాపారం,సంపద,బంధువులు,దేవత ,దోషాలు,మరియు అనేకమైన ఇతర అంశాలకి సంబందించిన ప్రశ్నాశాస్త్రం నేర్పబడుతుంది. శాస్త్రాన్ని నిజ జీవితంలో సులభంగా ఆచరణలో పెట్టడానికి సాధకులకు సిద్ధాంత పరమైన బోధనకు అదనంగా సంపూర్ణ సందర్బ పరిశీలన ( కేసు స్టడీ ) విధానంను పాటిస్తారు.

జ్యోతిష్య పట్టిక ఫల శాస్త్రము

గణితము (పట్టిక తయారీ విధానము) నుండి సంపూర్ణ వివరణాత్మకమైన పట్టిక వఱకు వివరించబడుతుంది .ఇది విద్యార్థులకు గ్రహ స్థితిగతులపై ,దేశకాలమానంపై మరియు సంబంధిత కారణాల ఆధారంగా జననం యొక్క పట్టిక మరియు జ్యోతిష్య పట్టికలను విశ్లేషించడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది.

తాంత్రిక శంఖు జ్యోతిష్య శాస్త్రము

ఇది వామ తంత్ర యొక్క ద్రావిడ మంత్రకములో అనుబంధ అంశము.కాళీ సాధన మరియు దీక్ష అభ్యాసము లో ఒక భాగము . శంఖమును ఉపయోగించి ప్రభావిత గ్రహాన్ని మరియు సమస్యని కనుగొంటారు .ద్రావిడ తంత్ర పద్దతిలోని పరిహారాలను బోధిస్తారు.కనుక ఈ అభ్యాసంలో శంఖు జ్యోతిష్య శాస్త్రము సిద్ధాంతానికి అదనంగా తంత్ర దీక్ష ,సాధన మరియు ప్రయోగాలు ఉంటాయి.

పొంతన (వివాహ పొందిక ) మరియు ముహూర్తం (కాల ఘట్టము )

కేరళ జ్యోతిష్య శాస్త్రము నక్షత్ర పొంతనని మాత్రమే నొక్కి చెప్పడం కాకుండా వివాహం కోరే పాప సమయ ,దశ సంధి పొంతన ,నవాంశ మరియు ఆరోగ్య, గర్భం మరియు స్థిరమైన సంబంధాల యొక్క సంబంధిత అంశాలను పొందికకై పరిశీలన చేస్తారు . ముహూర్తాలు పెట్టడం వ్యాపార మరియు ఇతర ప్రయత్నాలకై ఇంటి కుటుంబ వేడుకలు మరియు ఇతర ముఖ్య ఘట్టాల కొరకు సమయ నిర్దారణ నేర్పబడుతుంది.దీనిని పుట్టిన పట్టిక మరియు గ్రహాల స్థితిగతులను తగినట్టుగా విశ్లేషిస్తారు .

దృష్టి సారించిన అంశాలు

ఇవే కాకుండా అనుభవశూన్యులైన వారు అంశాలపై దృష్టి సారించడానికి మరియు అనుభవ జ్యోతిష్యలు వారి పరిజ్ఞానాన్ని వృద్దిచేసుకోవడానికి ప్రముఖమైన విషయాలు ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్రము ,ఆరోగ్య జ్యోతిష్యము ,జ్యోతిష్యంలో పరిహారాలు, నిమిత్త / శకునం జ్యోతిష్య మరియు సంఖ్యా శాస్త్రము వంటివి ప్రస్తావించబడ్డాయి .

error: Content is protected !!