శ్రీవిద్య తంత్ర పీడమ్ గురించి

శ్రీ విద్యా తంత్ర పీడం భారత దేశం లోని కేరళ రాష్ట్రంలో స్థాపించబడింది. శ్రీ విద్యా సాధన తంత్ర జ్ఞానాన్ని ఉత్సాహం పట్టుదల శ్రద్ధ గల అభ్యాసకులకు అందించాలనే లక్ష్యం తో వారినుండి ఎటువంటి రుసుము చందా వసూలు చేయకుండా మరియు దీనిని జగన్మాత శ్రీ రాజరాజేశ్వరీ దేవికి సేవగా అర్పిస్తున్నాము.

ప్రస్తుత కలియుగంలో తంత్రం అనేది ఆత్మ సాక్షాత్కారం కొరకు అత్యంత సమర్థవంతమైన మార్గంగా మహనిర్వాణ తంత్రం, కులార్ణవ తంత్రం మరియు బహుళ ఇతరమైన హిందూ పవిత్ర గ్రంథాలలో వివరించబడినది .ఇలాంటి శ్రీ విద్య తంత్రమును ధనిక, పేద, ధర్మ, లింగ వర్ణ భేదములు లేకుండా పరాశక్తి శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క తాంత్రిక మోక్ష విద్యను అందరూ నేర్చుకొనుటకు సదావకాశాన్ని ఈ శ్రీవిద్య పీడం కల్పిస్తున్నది.

శ్రీ విద్యా తంత్ర పీడం ప్రపంచంలో అన్ని ప్రదేశాలలో ఉన్న శ్రీ విద్యా సాధకులకు సాధనాపరంగా సహాయం చేయడంకోసం శ్రీ విద్యలో భాగమైన భక్తి ,జ్ఞాన ,క్రియ మరియు చర్య మొదలైన విషయాలపై యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ అకౌంట్ ల ద్వారా బోధనలు మరియు ప్రచురణలు చేస్తుంది .కుండలిని విద్యా అనేది శ్రీవిద్య పై పొరవంటిది అని శ్రీ విద్యా పూజ మరియు యోగ తరగతుల్లో భోదించబడుతుంది. క్రియ లో భక్తి ,జ్ఞాన మరియు చర్య భాగములు భరోసాకై కలుపబడ్డాయి.పూర్తి పరిజ్ఞానముకై ప్రతి అడుగు యొక్క ప్రాముఖ్యతను అంతరార్థాన్ని మరియు ఇతర అంశాలను అనేక కోణాల్లో భోధింపబడుతుంది.ప్రతి శిష్యడు / శిష్యరాలు పై సంపూర్ణ వ్యక్తిగత శ్రద్ధ చూపబడుతుంది, బోధన పద్ధతి ఆన్లైన్ లేక ముఖాముఖీ అయిననూ. వీరు నేర్చుకున్న పద్ధతులు మరియు సాధన అభివృద్ధి ఆధారంగా వారికీ తరువాతి స్థాయిలకు మార్గ నిర్దేశం చూపబడుతుంది.

శ్రీవిద్యా తంత్ర పీడం తరగతులు ప్రాచీన గురుకుల ఆధారిత మార్గమును అనుసరించును ,ఇక్కడ సాధకుడు తర్వాత స్థాయికి వెళ్ళడానికి ముందు ప్రస్తుతం నేర్చుకున్నవన్నీ తను ప్రదర్శించాలి.కనుక అంకిత భావంతో ఆధ్యాత్మిక పురోగతి సాదించడాన్నే సాధకుడి వద్దనుండి తిరుగి ఆశిస్తుంది ఈ శ్రీ విద్య పీడం.

error: Content is protected !!