Select Page
శ్రీవిద్యలోని మొదటి దీక్షలో భాగంగా త్రిపుర సాధన నేర్పడానికి మరియు మంత్ర దీక్షా ఇవ్వడానికి ముందు సాధారణంగా కనీసం మూడు దీక్షలు కలిగి ఉంటాయి.మొదటిది శాంభవి దీక్ష ,రెండవది శక్తి దీక్ష మరియు మూడవది మంత్ర దీక్ష.వీటిలో సాధకుడికి కలశాభిషేకం ఉంటుంది.తరువాత సాధకుడు తన తడి బట్టలను మార్చుకొని కొత్త బట్టలను ధరించిన తరువాత తరువాతి దీక్ష క్రమంలో భాగంగా అనేక న్యాసాలు మరియు శుద్ధి దశలు ఉంటాయి.ఇందులో కొన్ని దశలు కళ్ళకు గంతులు కట్టి మరియు కొన్ని ప్రక్రియలు సాధకుడు చూడగలిగే విదంగా ప్రక్రియలు ఉంటాయి.తరువాత త్రిపుర సాధన కొన్ని దశలు ,గురు పాదుక మంత్రము ,గణపతి మంత్రము, మరియు బాల యొక్క మూల మంత్రాలూ ఇచ్చిన తరువాత బోధింపబడుతుంది .ఇది కేవలం శ్రీవిద్యా యొక్క మొదటి దీక్ష వివరణ మాత్రమే.
చాలమంది ఒక మంత్రం- ఒక దేవత పద్దతిని తంత్రంలో రానున్న పరిణామాలు అర్థం చేసుకోకుండా పాటిస్తారు .అయితే ఒక మంత్రము- ఒక దేవత సాధన భక్తిపై దృష్టి సారించడానికి మరియు భక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది , మంత్ర దేవత లేక ప్రయోగించే పద్దతి సాధకునికి సరైనది కాకుంటే అనుకూల ఫలితాలకంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉంటాయి.ఒక మంత్రం-ఒక దేవత లో మోక్షానికై అన్వేషిస్తే అది ఆర్థిక సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను మీకు లేక మీకు ఇష్టమైనవారికి తెచ్చిపెడుతాయి. అందుచేతనే శ్రీవిద్యలాంటి తంత్ర పద్ధతులు ఆధ్యాత్మిక ప్రగతికి సాధకుని పరిపక్వతని మరియు సరియైన నియమాలపై దృష్టి సారించడాన్ని కలపడానికి సరియైన క్రమ సాధనని అనుసరిస్తారు.శ్రీవిద్యలోనే కాకుండా విధ్వంసకరమైన వైపునుండి కూడా దేవత కాళీ మాత ద్వారా చేరుకోవడానికి,
సంపద యొక్క ధన కాళీ వంటి అంగ -ఉపాంగ దేవతలతో తంత్ర పద్దతిని పాటించడం సూచించారు,సాధకుడు తన సాధనలో ఎటువంటి అడ్డంకులు ఎదురుకోకుండా.
దురదృష్టవశాత్తు పూజ పద్దతులను మరిచిపోయినప్పటికీ ,ఆధునిక గురువులు ఇప్పటికీ దీక్షా క్రమములో కనీసం త్రిపుర సాధనని అందించలేకపోతున్నారు .చాల మంది కేవలము మంత్ర ఉపదేశం ఇస్తున్నారు అంతే మరియు శిష్యునికి కర్మ బంధాలని పొందకుండా నివారించడానికి కనీసం దీక్షని ఇవ్వడంలేదు. శ్రీవిద్యలో దీక్ష మరియు మంత్రోపదేశం దశలవారీగా జరుగుతుంది .ఇవి కలశము మరియు పూజతో పవిత్ర గ్రంథాలలో వివరించిన విదంగా జరుపబడుతుంది.చాలామంది మంత్రోపదేశాన్ని ఆన్లైన్ వ్యాపారంగా లేక బృంద/వ్యక్తిగత సంఘటనగా మొదలుపెట్టారు.శ్రీవిద్యా తంత్ర పద్దతిలో తప్పనిసరిగా పాటించాల్సినవి ఏవీ అనుసరించడంలేదు. ఈ శ్రీవిద్యా తంత్ర పీడంలో ఉచిత తరగతులలో కనీసం ఒక ఏడాది పాటుగా అభ్యసిస్తున్న మరియు ఉచిత తరగతులలో బోధించిన దీక్ష దశకి అవసరమైన కనీస అర్హత ప్రదర్శిస్తారో కేవలం వారికి మాత్రమే శ్రీవిద్యా క్రమ దీక్ష ఇవ్వబడుతుంది.