Select Page
ప్రత్యేక దేవత దీక్ష మరియు మంత్ర ఉపదేశ వ్యక్తి ఆ దేవత సాధన ప్రాపంచిక లేక ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి సరియైనదా అని పరీక్షించిన తరువాతే ఇస్తారు.ఆ దీక్ష మరియు మంత్ర ఉపదేశం సరియైన కలశాభిషేకం ద్వారా దేవత శక్తిని ఆవాహన చేత, సాధకుడు హోమము ద్వారా దేవతకి నైవేద్య సమర్పణ సాంప్రదాయ పద్దతిలో జరుగుతుంది,మరియు దేవత యొక్క సాధన విధానాన్ని ఎలా చేయాలో ఉపదేశం చేస్తారు.
ఇది సంవత్సరానికి ఒకసారి నిర్వహించే పవిత్ర ఉత్సవం.ఉపనయనము ఎటువంటి కుల సంబంద నియమాలు లేకుండా జరుపబడుతుంది, కాబట్టి సాంప్రదాయాన్ని పాటించడానికి ఆసక్తిగలవారెవరైనా ఉపనయనము అనుష్టించవచ్చును. ఇది సాంప్రదాయ పద్ధతుల్లో జరుపబడుతుంది, మరియు ఆసక్తి గల వారు కేంద్రంలో కనీసం రెండు రోజులు కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఉండవలిసి ఉంటుంది.ఇది గురువుగారి నుండి యజ్ఞోపవీత సమ్మతి గాయత్రీ మంత్ర దీక్ష మరియు సంధ్యా వందన బోధన కలిగి ఉంటుంది.